Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిపై నిర్భయ, పీడీ యాక్టు నమోదు చేస్తాం: డీసీపీ సత్యనారాయణ

మూడుసార్లు ఈవ్ టీజింగ్ కు పాల్పడిన వారిపై నిర్భయ, పీడీ యాక్టు నమోదు చేస్తామని హైదరాబాదు డీసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. పాతబస్తీలో షీ టీమ్స్, సౌత్ జోన్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న 55 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆకతాయిల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు గాను ‘ఆపరేషన్ మైనర్’ పేరుతో సిటీ బస్సుల్లో కూడా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి సౌత్ జోన్ పరిధిలో ఈవ్ టీజింగ్ ను పూర్తిగా అరికడతామని చెప్పారు. ఈవ్ టీజర్లు మైనర్లయినా సరే, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సత్యనారాయణ పేర్కొన్నారు.

More Telugu News